తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి

68చూసినవారు
తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి
AP: విశాఖ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఆనందపురం మండలం శొంఠ్యాం హైవే వద్ద బైక్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చరీకి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్