జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆదివారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. భూమికి 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అయితే భూకంపం సంభవించిన సమయంలో ఎవరికీ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.