విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి

2929చూసినవారు
విద్యుత్ ఘాతంతో యువకుడు మృతి
విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందిన ఘటన అనపర్తి మండలం కుతుకులూరులో మంగళవారం చోటుచేసుకుంది. కుతుకులూరుకి చెందిన బంగార్రాజు సొంతింటి నిర్మాణంచేపట్టారు. అయితే పనుల్లో భాగంగా ఇసుక జల్లించే యంత్రానికి విద్యుత్తు సరఫరా అందించే తీగపై అనుకోకుండా కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. కుటుంబ సభ్యులు అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్