అనపర్తి అసెంబ్లీ సీటును టీడీపీకి కేటాయించాలని రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రక టించాలని డిమాండ్ చేస్తూ బిక్కవోలు మండలం కొంకుదురులో టీడీపీ నాయకుడు కర్రి సత్యనారాయణరెడ్డి చేపట్టిన నిరవధిక దీక్షను గురువారం రామకృష్ణారెడ్డి, తనయుడు మనోజ్ నిమ్మరసం ఇచ్చి విరమింపజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు టిక్కెటు విషయంలో అధైర్య పడొద్దని, అనపర్తిలో పోటీ చేసేది తానేనన్నారు.