ద్వారకా తిరుమల మండలం గుండుగోలు గుంట గ్రామంలోశ్రీ కండిగలమ్మ అమ్మవారు, శ్రీ పోతురాజు స్వామి వారికి భీమడోలు గ్రామానికి చెందిన త్రిమూర్తులు 2కేజీల 30గ్రాములతో అమ్మవారికి వెండి కిరీటం చేయించారు. చిలుకూరి నరసింహమూర్తి దంపతులు అమ్మవారికి బంగారపు కళ్ళు చేయించారు. గురువారం పూజా కార్యక్రమాలు జరిపించి, వేద పండితులచే అమ్మవారికి అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదల స్వీకరించారు.