రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తు పై ఓటు వేసి మద్దిపాటి వెంకటరాజుని ఎమ్మెల్యేగా గెలిపించాలని దేవరపల్లి మండల తేదేపా శ్రేణులు సూచించారు. ఈ మేరకు బుధవారం దేవరపల్లి మండలం గౌరీపట్నంలో మండల తేదేపా అధ్యక్షుడు అనిల్ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తేదేపా శ్రేణులు ఇంటింటికీ వెళ్లి సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు.