చాగల్లు మండలం చాగల్లు పరిసర ప్రాంతాలు ఊనగట్ల చిక్కాల మల్లవరం చంద్రవరం మార్కొండపాడు గ్రామలలో శుక్రవారం సాయంకాలం ఆకాశం ఆకస్మికంగా మేఘావృతమై చీకటిని తలపించి, ఉరుములు కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపులతో వర్షం పడింది. ఇండ్లలో ఉన్న వారికి కొంత ఊరట కలిగినా పొలంలో ఉన్నవారు, ఆరుబయట ఉన్నవాళ్ళ పరుగులు తీసారు. ఈ సంవత్సరం ఇంత పెద్ద శబ్దంతో పిడుగులు పడటం ఈరోజే చూసామని ప్రజలు వాపోయారు.