
దేశంలో 7 వేలకు చేరిన కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 306 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆరుగురు చనిపోయారు. అత్యధికంగా కేరళలో 170, గుజరాత్లో 114, ఢిల్లీలో 66 మందికి కరోనా సోకింది. కేంద్ర ఆరోగ్యశాఖ డేటా ప్రకారం దేశంలో 7,121 యాక్టివ్ కేసులు ఉండగా.. కేరళలో అత్యధికంగా 2,223, గుజరాత్లో 1,223, ఢిల్లీలో 757, వెస్ట్ బెంగాల్లో 747, మహారాష్ట్రలో 615 కేసులు ఉన్నాయి. APలో 72, TGలో 11 యాక్టివ్ కేసులున్నాయి.