ఏలేరు ముంపు ప్రజలను అప్రమత్తం చేయాలి
ఏలేరు రిజర్వాయర్ నీటిని బుధవారం సాయంత్రం విడుదల చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు ప్రాంత ప్రజలను, రైతులను అప్రమత్తం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీ ఇప్పటికే ముంపులో ఉన్నందున స్థానిక అధికారులు నిత్యావసరాలు అందేలా చూడాలని కోరారు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులతో సమన్వయం చేసుకొని రైతాంగానికి, ప్రజలకి ధైర్యం చెప్పాలని సూచించారు.