దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు అందించేందుకు గుర్తింపు శిబిరం శుక్రవారం జరుగుతుందని ఎంపీడీవో జయప్రకాశరావు తెలిపారు. ఏఎల్ఎఐఎంసీవో సంస్థ ద్వారా పిఠాపురంలోని అంబేడ్కర్ కమ్యూనిటీ హాలులో శుక్రవారం శిబిరం నిర్వహిస్తారన్నారు. సైకిళ్లు, తదితర దివ్యాంగులకు ఉపకరించే ఉపకరణాలు అందించేందుకు అర్హులను ఎంపిక చేస్తారన్నారు. ఐడీకార్డు, సదరం ధ్రువపత్రం, రేషన్ కార్డు, రెండు ఫొటోలు తీసుకుని శిబిరానికి రావాలన్నారు.