కడియం మండలం వేమగిరిలో 4న జరగనున్న గ్లోబల్ స్టార్ రాంచరణ్ గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతం కావాలని రాష్ట్ర చిరంజీవి యువత ప్రధానకార్యదర్శి ఏడిద బాబీ ఆధ్వర్యంలో గురువారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు రవణం స్వామినాయుడు జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ నగర వీధుల్లో సాగింది. కాగా శుక్రవారం మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని బాబీ తెలిపారు.