ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా ఉన్న కూటమి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ భరత్ పిలుపు నిచ్చారు. బుధవారం రాజమండ్రిలోని వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు భరత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. వైస్సార్ విగ్రహానికి భరత్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, మార్గాని నాగేశ్వరావు, తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.