పవిత్రతకు ప్రతీక, సేవా భావానికి, మత సామరస్యానికి చక్కటి నిర్వచనం ‘రంజాన్’ అని సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. రంజాన్ పండుగను పురష్కరించుకుని రాజమండ్రిలోని పలు మసీదుల్లో గురువారం జరిగిన ప్రత్యేక ప్రార్ధనలకు వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు ఈద్ ముబారక్ తెలిపారు.