రాజమండ్రి రూరల్ మండలం గాంధీపురం ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి రాంబాబు, ఎంపీడీవో డి. శ్రీనివాసరావు పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఎందరో త్యాగాల కృషి పలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం అని పేర్కొన్నారు.