రాజనగరం మండలం తోకాడకు చెందిన మేకల లక్ష్మీపతిరావు అనే దళితుని ఇంటి ముందు కొంతమంది వ్యక్తులు అడ్డుగా బల్లలు వేసి, వేధింపులకు గురి చేస్తున్నారని, తక్షణమే వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజనగరం ఎంపీడీవో కార్యాలయం ముందు దళిత ప్రజా సంఘాలు శనివారం ఆందోళన చేపట్టాయి. విషయం తెలుసుకున్న డీఎస్పీ వైస్ శ్రీకాంత్ అక్కడకు చేరుకుని ఆందోళనకారులు, అధికారులతో సంప్రదింపులు జరిపి, ఆందోళన విరమింప చేశారు.