ఆలమూరు మండలం జొన్నాడ వంతెన పైనుండి గోదావరిలోకి దూకే ప్రయత్నం చేయబోయిన ఒక మహిళను రావులపాలెం రూరల్ సీఐ విద్యాసాగర్ సిబ్బందితో రక్షించిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వారు తెలిపిన వివరాల ప్రకారం బిక్కవోలు మండలానికి చెందిన పలివెల శైలజ కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇది గమనించిన రూరల్ సీఐ విద్యాసాగర్ సిబ్బంది ఆమెను రక్షించి కౌన్సిలింగ్ ఇచ్చి బంధువులకు అప్పగించారు.