అమలాపురం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇద్దరు బెల్ట్ షాపు నిర్వాహకులను బైండోవర్ చేశారు. అయినవిల్లి మండలంలో ఇద్దరు పాత బెల్టు షాపు నిర్వాహకులు తోత్తరమూడి చెందిన రాజేష్, వీరవల్లి పాలెంకు చెందిన తాతాజీలను అరెస్టు చేసి అయినవిల్లి ఎమ్మార్వో వద్ద ప్రవేశపెట్టినట్లు ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ తెలిపారు. సెక్షన్ 129 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ ప్రకారం బైండోవర్ చేసినట్లుగా సీఐ సత్యనారాయణ శుక్రవారం తెలిపారు.