ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ద్వారా విద్యుత్ బిల్లులను అదుపు చేసుకునే అవకాశం ఉంటుందని అల్లవరం విద్యుత్ సబ్ స్టేషన్ ఏఈ వెంకటేశ్వరరావు తెలిపారు. సబ్ స్టేషన్ వద్ద బుధవారం దీనిపై అవగాహన కార్యక్రమం జరిగింది. రాయితీతో ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై సోలార్ రూప్ టాప్ నిర్మించుకోవాలన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.