అల్లవరం మండలం అల్లవరం 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లే దారి అధ్వానంగా మారింది. చినుకు పడితే చాలు ఈ మార్గం బురదమయమవుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే మార్గంలో పలు ప్రభుత్వ కార్యా లయాలు ఉన్నప్పటికీ ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ దారిలో వెళ్లేందుకు ఉద్యోగుల సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమస్య పరిష్కరించాలని ప్రయాణికులు శనివారం కోరారు.