అల్లవరం: కోడి పందేలు వద్దంటూ తీర్మానించిన గ్రామస్థులు

53చూసినవారు
అల్లవరం: కోడి పందేలు వద్దంటూ తీర్మానించిన గ్రామస్థులు
సంక్రాంతి పండుగ సందర్భంగా తమ గ్రామంలో కోడి పందేలు ఏర్పాటు చేయకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను కోరుతూ అల్లవరం మండలం రెళ్లుగడ్డ గ్రామ పంచాయతీ శుక్రవారం తీర్మాణం చేసింది. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగలో తమ గ్రామంలో కోడి పందేలు జరిగేవని తెలిపారు. గత ఏడాది రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడి కేసులకు దారి తీసిందన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్