కోనసీమలోని అనుమతులు మంజూరు చేసిన ఇసుక ర్యాంపులలో ప్రతిరోజు 20,000 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరపాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద శుక్రవారం ఆయన జిల్లాస్థాయి ఇసుక కమిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇసుక రీచుల వారీగా ఆయన త్రవ్వకాలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రతిరోజు ప్రతి ఇసుక రీచ్ నుంచి 500 మెట్రిక్ టన్నుల ఇసుక త్రవ్వకాలు జరపాలన్నారు.