అమలాపురం: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు

55చూసినవారు
అమలాపురం: రాజకీయాల్లోకి ఏబీ వెంకటేశ్వరరావు
ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. రాజకీయాల్లోకి వస్తున్నానని వెల్లడించారు. అమలాపురంలో విలేకరుల సమాజంలో ఆదివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సమాజం కోసం పని చేయాలని నిర్ణయించుకున్నానని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు నావంతు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి ఏ పార్టీలోనూ లేనని చెప్పారు. జగన్ బాధితులకు అండగా ఉంటానని, అతని అక్రమాలు, అన్యాయాలు బయట పెడతానని హెచ్చరించారు. తన ప్రయత్నానికి అందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్