భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఆశయాలు ఆచరణీయమని జిల్లా ఎస్పీ కృష్ణారావు వ్యాఖ్యనించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఎస్పీ కార్యాలయం వద్ద సోమవారం సిబ్బందితో కలిసి ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ అందించిన సేవలను కొనియాడారు.