ఏపీఎస్ఆర్టీసీ అమలాపురం డిపోలో ఓ ఏఆర్ కానిస్టేబుల్ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని ఆర్టీసీ అధికారులు సోమవారం గుర్తించారు. అతడి వద్ద ఉన్న ఓ బ్యాంక్ పాస్‌బుక్ ద్వారా భోగిరెడ్డి అంకిరెడ్డి అని గుర్తించారు. వెంటనే ఈ విషయం పట్టణ పోలీసులకు తెలియజేసి 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.