ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురష్కరించుకుని అమలాపురం ఏరియా ఆసుపత్రి నుంచి నల్లవంతెన వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఈ ర్యాలీలో ఏరియా ఆసుపత్రి వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.
జూన్ 10 నుంచి 14 వరకు రక్తదానం ప్రయోజనాలపై అమలాపురం ఏరియా ఆసుపత్రిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్రావు తెలిపారు.