అమలాపురం: వ్యాధులపై అవగాహన కల్పించాలి: కలెక్టర్

78చూసినవారు
అమలాపురం: వ్యాధులపై అవగాహన కల్పించాలి: కలెక్టర్
మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లో మలేరియా, డెంగ్యూ వ్యాధుల పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. గ్రామాల్లో వైద్య సిబ్బంది మలేరియా, డెంగ్యూ వ్యాధుల పట్ల జాగ్రత్తలను ప్రజలకు వివరించాలని కలెక్టర్ కోరారు. డీఎంహెచ్ఐ దుర్గారావు దొర, జిల్లా మలేరియా అధికారి వెంకటేశ్వరరావు, సీఎంఓ శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్