కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చర్యలు వేగవంతం అయ్యాయని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు. విశాఖ ఉక్కులో తొలగించిన 4, 500 కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సోమవారం అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్లో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సొంత గనులు కేటాయించకుండా నష్టాలకు ఉద్యోగులు బాధ్యులని ఎమ్మెల్యేలు మాట్లాడటం సిగ్గు చేటన్నారు.