అమలాపురం మున్సిపాలిటీ పరిధిలోని కొంకాపల్లిలోని హరి మానసిక దివ్యాంగుల పాఠశాలలో మామిడికుదురుకు చెందిన మానవత్వం స్వచ్చంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం దీపావళి పండుగను ఘనంగా నిర్వహించారు. ట్రస్ట్ వ్యవస్థాపకులు బత్తుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు షర్టులు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు.