అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురం బాలయోగి స్టేడియంలో జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు మంగళవారం ముగిసాయి. అంబేడ్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరిగిన ఈ టోర్నమెంట్ లో మలికిపురం జట్టు విజేతగా, అమలాపురం జట్టు ద్వితీయ, గూడాల జట్టు తృతీయ స్థానాలు సాధించాయి. విజేతలకు వైద్యులు రవితేజ, దిలీప్, వెంకటేశ్వరరావు, కుంచే రమణారావు ట్రోఫీలు బహుమతులు అందించారు.