అమలాపురం: సమర్థవంతంగా పథకాల పంపిణీ: కలెక్టర్

57చూసినవారు
అమలాపురం: సమర్థవంతంగా పథకాల పంపిణీ: కలెక్టర్
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జిల్లాలో సమర్థవంతంగా పంపిణీ చేస్తున్నామని జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ గురువారం అమలాపురంలో తెలిపారు. జిల్లాలో 28 కేటగిరీల కింద ప్రతి నెలా రూ. 101.15 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. అలాగే ప్రతి నెలా రూ. 30.26 కోట్లను పింఛన్ల రూపంలో అందిస్తున్నామని పేర్కొన్నారు. దీపం-2 పథకం కింద 5,37,962 మంది లబ్ధిదారులకు గ్యాస్ సబ్సిడీ లభిస్తుందని కలెక్టర్ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్