ప్రజలను సంతృప్తి పరిచే విధంగా భూ పరిపాలన రీ సర్వే అంశాలలో ఉద్యోగులు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని కోనసీమ కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. రాష్ట్ర భూ పరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కు ఆయన అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి మంగళవారం హాజరయ్యారు. వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు.