అగ్నిమాపక సేవలు వారోత్సవాల కరపత్రికను అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ సోమవారం అమలాపురం కలెక్టరేట్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలను నివారించుటకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఏప్రిల్ 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు అగ్నిమాపక సేవలు వారోత్సవాలు జరుగుతాయి అని తెలిపారు. ఆపద సమయాలలో అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి సేవలు చేస్తారని కలెక్టర్ అన్నారు.