అమలాపురం పట్టణ కేంద్రం అమలాపురంలో బుధవారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఉదయం 6.30 గంటల నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. అమలాపురం పట్టణం, రూరల్ మండలంలోని కామనగరువు, రోళ్లపాలెం గ్రామాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. కొబ్బరి, వరి రైతులకు ఈ వర్షం వల్ల మేలు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా వేడి ఉక్క బోతతో అల్లాడిన ప్రజానీకానికి వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది.