అమలాపురం పట్టణంలోని నల్ల వంతెన, ఎర్ర వంతెన మధ్య ఉన్న ఎన్టీఆర్ మార్గంలోని రాజప్ప కాలిబాట వంతెన వద్ద పెచ్చులూడి ఐరన్ ఊసలు పైకి ఎగసి ప్రమాదకరంగా మారాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికే పలువురు ఈ ఐరన్ ఊసలు తగిలి ప్రమాదాలకు గురయ్యారు. దీనిపై మున్సిపాలిటీ అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని బుధవారం స్థానికులు కోరారు.