కష్టపడి చదివిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సొంతం అవుతుందని భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసానికి జిల్లా యంత్రాంగం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి భరోసాగా ఉండి అండగా నిలుస్తుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి మెరిట్ విద్యార్థులకు సూచించారు. పబ్లిక్ పరీక్షలలో అధిక మార్కులు పొందిన విద్యార్థినీ విద్యార్థులను బుధవారం అమలాపురంలోని కలెక్టరేట్ లో నిఘంటువులు బహుకరించి ఘనంగా సన్మానించారు.