అమలాపురంలోని కలెక్టరేట్ లో డెంగ్యూ నివారణ దినోత్సవ అవగాహన కార్యక్రమం గోడ పత్రికలను గురువారం జాయింట్ కలెక్టర్ నిశాంతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డెంగ్యూ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు ముమ్మరంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో దుర్గారావు దొర, సిబ్బంది పాల్గొన్నారు.