పల్నాడులో సాక్షి జర్నలిస్టులపై అక్రమ కేసుల నిరసనగా ఏపీయూడబ్ల్యూజే, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అమలాపురం కలెక్టరేట్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. అక్రమ కేసులు తొలగించాలని డిమాండ్ చేశారు. ఏవో కాశి విశ్వేశ్వరరావు జర్నలిస్టులు వినతిపత్రం సమర్పించారు. ఏపీడబ్ల్యూజే ఉమ్మడి జిల్లా కార్యదర్శి ప్రసాద్, జర్నలిస్టు సంఘాల నాయకులు ఎంఎన్వీ ప్రసాద్, కొండేపూడి సత్యనారాయణ, నిమ్మకాయ సతీష్ బాబు పాల్గొన్నారు.