అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు శనివారం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 09. 00 గంటలకు అమలాపురం మండలం పాలగుమ్మిలో, ఉదయం 11 గంటలకు అల్లవరం మండలం ఓడలరేవులో మధ్యాహ్నం 12. 00 గంటలకు ఉప్పలగుప్తం మండలం చల్లపల్లిలో, సాయంత్రం 5 గంటలకు అమలాపురం పట్టణం 6, 9 వ వార్డులలో జరుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సభ్యులు తెలిపారు.