ఆర్టీసీ బస్సు డ్రైవర్ నారాయణ అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ అమలాపురం ఆర్టీసీ డిపో ఎదుట ఉద్యోగులు దీక్షలు గురువారం నాటికి 18 రోజులు చేరుకున్నాయి. డ్రైవర్ నారాయణను అన్యాయంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. అనంతరం ఎన్ఎంయుఏ డిపో ప్రెసిడెంట్ ఔలియా మాట్లాడుతూ అక్రమ సస్పెన్షన్ ను ఎత్తివేసే వరకు ఉద్యమం కొనసాగిస్తామన్నారు. డ్రైవర్ కు న్యాయం జరిగే వరకు మరింత ఉద్యమం చేపడతామన్నారు.