ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) సోమవారం జరుగుతుందని కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఉదయం 10 గంటలకు అమలాపురం గోదావరి భవనంలో ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. ప్రజలు 1100 నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదుల స్థితిని తెలుసుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.