ఆడవాళ్ల కన్నీరు బాబు సర్కార్ కు సమాధి అంటూ మంగళవారం అమలాపురంలో వైసీపీ నాయకులు నిరసన ర్యాలీ నిర్వహించారు. కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయని కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆరోపించారు. అనంతపురంలో దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.