అమలాపురం: కోళ్లను చంపిన తాచుపాము.. బంధించిన స్నేక్ క్యాచర్

61చూసినవారు
అమలాపురం మండలం రెడ్డిపల్లిలో నూకల గణపతిరావు ఇంటి దగ్గర కోళ్ల పెట్టెలో శనివారం తాచు పాము ప్రవేశించింది. నాలుగు కోడి పిల్లల్ని, కోడి పెట్టను మట్టు పెట్టింది. దీన్ని గమనించిన గణపతిరావు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మను సంప్రదించారు. ఆయన అక్కడకు వచ్చి తాచు పామును డబ్బాలో బంధించారు. దాన్ని సుదూర ప్రాంతానికి తీసుకువెళ్లి విడిచిపెట్టారు. వేసవిలో పాముల బెడద తీవ్రంగా ఉందని, అప్రమత్తంగా ఉండాలని వర్మ తెలిపారు.

సంబంధిత పోస్ట్