అమలాపురం: ఇంటర్ ఫలితాలపై అధ్యాపకుల ధీమా

55చూసినవారు
ఇంటర్ పరీక్షా ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. గత ఏడాది కన్నా ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తారన్న ధీమా అధ్యాపకులు వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది ఫస్ట్ ఇయర్లో 60%, సెకండ్ ఇయర్లో 72% ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్రంలో ఫస్ట్ ఇయర్లో 17, సెకండ్ ఇయర్లో 16వ స్థానంలో కోనసీమ నిలిచింది. ఫస్ట్ ఇయర్లో 13, 431, సెకండ్ ఇయర్లో 13, 881, మొత్తం 27, 312 మంది పరీక్షలు రాశారు.

సంబంధిత పోస్ట్