అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొమ్మునేని శ్రీనివాస్, కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు ఆధ్వర్యంలో మంగళవారం అమలాపురం గడియారం స్తంభం వద్ద తెలుగు మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన వారు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.