అగ్ని ప్రమాదంలో తాటాకు ఇళ్లు దగ్ధమయ్యాయి. అమలాపురం రూరల్ మండలం కామనగరువు జంగంపాలెంలో ఆదివారం అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తాటాకు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక ఇంటిలో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఇంటికి కూడా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.