కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి సంవత్సరమైన సందర్భంగా అమలాపురం గడియార స్తంభం సెంటర్లో కూటమి నేతలు గురువారం సంబరాలు చేసుకున్నారు. గత సంవత్సరం నుంచి పాలనంతా స్వర్ణ యుగమేనని అమలాపురం ఎమ్మెల్యే అయితా బత్తుల ఆనందరావు అన్నారు. కేక్ కట్ చేసి ఆనందోత్సాహాలతో నినాదాలు చేశారు. ఈ సంబరాలలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.