నిరుపేదలకు భూముల క్రమబద్ధీకరణ చట్టం ఒక వరంగా మారిందని జేసీ నిషాoతి ఆదివారం అమలాపురం నుండి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూవివాదాలు, సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ చట్టాలు, నిబంధనల్లో సమూల మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం భావించి భూముల క్రమ బద్ధీకరణ పథకం-2025 ప్రవేశపెట్టిందన్నారు. సామాన్యులు ఎదుర్కొంటున్న అసైన్డ్ భూముల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపాలని నిర్ణయించిందన్నారు.