అమలాపురం: రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి

58చూసినవారు
రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నశించాలి అంటూ వైసీపీ మహిళా నేతలు నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మహిళా నేతలు మంగళవారం అమలాపురంలో నిరసన ర్యాలీ చేపట్టారు. జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్ చేస్తూ సూర్యనగర్ నుంచి మద్దాలవారి పేట వరకు ర్యాలీగా వెళ్లి అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.

సంబంధిత పోస్ట్