అమలాపురంలో వాతావరణం ఒక్కసారిగా మారి గురువారం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అమలాపురంలో రూరల్ మండలం పరిధిలోని సమనస పంచాయతీలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో ప్రధాన రహదారిపై చింత చెట్టు విరిగి పడడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. చెట్టును పంచాయతీ సిబ్బంది తొలగించకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.