పర్యావరణ సమతుల్యతను, జీవవైవిద్యాన్ని కాపాడటానికి నిర్వహించే ముఖ్యమైన కార్యక్రమం వన మహోత్సవ కార్యక్రమమని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి జీవరాశి మనుగడకు తోడ్పాటు అందించాలని ఆర్డీవో మాధవి పిలుపునిచ్చారు. శనివారం అమలాపురం ఆర్డిఓ కార్యాలయం వద్ద విద్యార్థుల ద్వారా జూలై 1 నుండి 7 వరకు నిర్వహిస్తున్న వారోత్సవ వనమహోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు.